Posts

మీసేవ సెంటర్

మీసేవ సెంటర్ క్రొత్తగా ఈ సంవత్సరం ప్రారంభించారు మెయిన్ రోడ్ కు ఎదురుగ పరమేశరావు ఫౌండ్రి షాప్ కు ఎదురుగా ఉంటుంది కాంటాక్ట్ NO   9603160906 7288868782

MAP KRISHNA DIST

KRISHNA DIST MAP

NEW MESEVA IN ETIMOGA NEAR ROAD

NEW MESEVA IN ETIMOGA 

ఏటిమొగ లో 18 అక్టోబర్ న జన్మభూమి

   ఏటిమొగ లో  18 అక్టోబర్ న జన్మభూమి జరుగ నుండి , ఎవరినా పెన్షన్ లు లేకున్నా ,ఇళ్ళ స్తలాలు లేకున్నా ,ఇల్లు లేకున్నా , మరుగుదొడ్లు లేకున్నా , పడవల అర్జీలు పెట్టుకోవాల్లన్నా , పంట నష్టాలు పెట్టుకోవాలన్న , రేషన్ కార్డులు పెట్టుకోవాలన్న , నిరుద్యోగ అర్జీలు పెట్టుకోవాలన్నా , అధికారులు మన దగరకు వస్తునారు గనక ముందుగా తొందర పడవలసిందిగా కోరుతున్నాము . అర్జీలు ఎవరికైన కావలసిన వారు అన్నం సాయి ని గాని వనమల సోమషేకర్ని గాని సంప్రదించగలరు 

వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న జాలర్లు

Image
Sakshi  | Updated: November 20, 2013 09:07 (IST) వీడియోకి క్లిక్ చేయండి నాగాయలంక : కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద సముద్రంలో మత్స్యకారులు చిక్కుబడిపోయారు. స్వర్లగొంది సమీపంలోని వేటకోసం సముద్రానికి వెళ్లిన 25 మంది మత్యకారులు చిక్కుకున్నారు. డీజిల్‌ అయిపోవడంతో సముద్రంలోనే బోట్లు నిలిచిపోయాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన సమయంలో మత్స్యకారులు సముద్రంలో చిక్కుకోవడంతో మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం నేడు తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు చెన్నై-ఒంగోలు మధ్య తీరందాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలకు వర్ష సూచనతో పాటు గంటకు 45-55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. దాంతో అన్ని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.  

ట్రే కేజ్.. ఎంతో క్రేజ్..

Image
Sakshi  | Updated: July 22, 2014 02:24 (IST)   తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు   ఒక్కో పీతకు రూ.600 లాభం   సొర్లగొందిలో సిబా ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా సాగు   ముందుకొస్తున్న మత్స్యకారులు ట్రే కేజ్ పద్ధతి.. ప్రస్తుతం పీతల వ్యాపారంలో లాభాలు తెచ్చిపెడుతున్న సరికొత్త విధానం. పీతల అమ్మకాల్లో దళారుల బారినపడి నష్టపోతున్న వారికి ఇది ఎంతో ప్రయోజనకరం. నాగాయలంక మండలం సొర్లగొందిలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వా కల్చర్ (సిబా) ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిపై పీతల సాగుకు శ్రీకారం చుట్టారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. రాష్ట్రంలో తొలి   సారిగా చేపట్టిన ఈ    పద్ధతిపై మత్స్యకారులు ఆసక్తి కనబరుస్తున్నారు. నాగాయలంక : సాధారణంగా ఎస్టీలు ఎక్కువగా పీతలు పడుతుంటారు. జిల్లాలోని నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో నదీపాయలు, సముద్రతీర ప్రాంతంలో కొక్కేలు ఉపయోగించి వీటిని వేటాడతారు. ఆ తరువాత మత్స్యకారులు వలలతో పచ్చపీతలు పడతారు. ఈ మండలాల నుంచి రోజుకు 1,500 నుంచి 2వేల కిలోల పీతలు ఎగుమతవుతుంటాయి. బరువును బట్...

భావదేవరపల్లిలో పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభం

Sakshi  | Updated: June 15, 2013 14:16 (IST) India  :నాగాయలంక : కృష్ణాజిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. నాగాయలంక మండలం భావదేవరపల్లి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలను ఆయన ప్రారంభించారు. కళాశాలలో సీట్ల శాతాన్ని పెంచుతామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. కళాశాల వెబ్‌సైట్ ప్రారంభించి విద్యార్థులు, మత్స్యకారులతో మాట్లాడారు. రూ.67.17 కోట్లతో చేపట్టిన తుపాను అత్యవసర పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ నీలం తుఫాను బాధితుల్ని ఆదుకుంటామని తెలిపారు. అలాగే జిల్లాలోని బ్రిడ్జిలకు సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.