Temples


1.  Sri Rama Temple
రామాలయం మా చిన్న తనం లో చిన్నగా  తుఫాన్ బిల్డింగ్ అంత ఉండేది. తరువాత గ్రామస్తులు అంత కలిసి పంటలు బాగా వచినప్పుడు విరాళాలు వేసుకుని , గ్రామంలోని దేవుని సొమ్ము హుండిలో దేవునికి వచ్చిన సొమ్ము తో ఇప్పుడు ఉన్నటువంటి రామాలయాన్ని నిర్మించారు .రామాలయ విగ్రహాలను మచిలీపట్టణం లో ఒక చిన్న గ్రామం లో తీసుకుని వచారని చెప్పేవారు . విగ్రహాలను తీసుకువచేటప్పుడు అన్ని గ్రామాలలో ఊరేగిస్తూ తెసుకుని వచ్చారు . రామాలయం లో శ్రీ రాముడు ,సీత,లక్ష్మణ ,ఆంజనేయుడు శ్రీ రాముని పాదాల చెంత కొలువి ఉన్నాడు .మన ఊరి రామాలయానికి భక్తులకు బాగా నమ్మకం ఉంది . పంటలను మొదలు పేటేటప్పుడు శ్రీరామునికి పూజలు చేసి మొదలు పెడతారు ఇక్కడి ప్రజలు. ప్రతి శ్రీ రామ నవమి రోజున శ్రీరాముని మన ఏటిమొగ గ్రామం లో గల ఏటి(నదిలో) లో ప్రజలంతా స్నానం ఆచరించిన తర్వాత ఊరు అంతా    
తిప్పుతారు, ప్రజలు ఆచార సంప్రదాయాలతో దేవుని పాదాలను పసుపునీలతో కడిగి ,కుంకుమ ,కొబ్బరికాయలతో  పూజలు ఆచరిస్తారు . ఆ తర్వాత బజానా బృందం మేళ  తాళాలతో సీతారాములను గుడిలో ఉంచుతారు .



2. Sri Abhayanjaneya temple
శ్రీ అభాయంజనేయుని గుడి ని క్రోతగా రామాలయాని నిర్మాణం జరిపినప్పుడు నిర్మాణం చేసారు . అభాయంజనేయుని గుడి ఏటిమొగ గ్రామానికి ఎంట్రన్స్ లో ఉంటుంది . ఆంజనేయుని పెట్టినప్పటినుండి ఏటిమొగ కు ఎటువంటి ఆపదలు వచ్చిన పంటలకు గాని , ప్రజలకు గాని ఎటువంటి నష్టాలు జరుగలేదని పెద్దలు చెప్తూ ఉంటారు . ఇక్కడి ప్రజలు ఆంజనేయస్వామిని అమితముగా నమ్ముతారు . పంటలు పండినప్పుడు ధాన్యం కొలిసి దేవునికి ఇవ్వటం ఇక్కడి ఆనవాయితీ . వాటిని ఆంజనేయ జయంతి రోజున కమిటీ సంతర్పణం నిర్వహిస్తారు . ప్రతి మంగళ వారము బజానా బృందం సాయంత్రా కాలం లో భజన చేసి పూజలు చేస్తారు . 


3.  Sri Potharaju swamy Temple
పోతురాజు గుడి చెరువుకు అనుకుని ఉన్నది . ఎప్పటి నుండో పోతురాజు గుడి శిలలతో ఉండెడిది తాటాకు పందిరి కట్టి ఉండెడిది . రామాలయం కట్టిన తర్వాత గుడి ల కట్టారు . ఇక్కడి ప్రజలు పోతురాజును 101 దేవతా  మూర్తుల కు ఉక్కడే తమ్ముడని కొలుస్తారు ,ప్రతిఉక్క పండుగ రోజున పోతురాజుకు ప్రదక్షణలు చేసి పసుపు నీలతో అభిషేకం చేసి , జంజం వేసి , పసుపు రాసి , పొంగళ్ళు పెడతారు . ఇక్కడ సంక్రాంతి పండుగ రోజున పోతురాజుకు నాటుకోల్లతో భోణం ఇస్తారు . ప్రతి సంవత్సరం పోతురాజు సంభరాలు చేస్తారు , ప్రజలు పూజలు చేస్తారు .ఎలా చేసేటప్పుడు ప్రజలంతా పనులకు వల్లకుండా , ప్రక్క ఊరులు వెళ్ళకుండా ఆడపడుచులను , అన్నదమ్ములను పిలచుకుని ఒక పండగ చేసుకుంటారు , ఇక్కడి ప్రజలకు పోతురాజు రాత్రి పగలు తిరుగుతూ  ఊరిని కాపడుతాడని నమ్మకం .పోతురాజు గుడి లో నాయుడు వారు ఎప్పటినుండో పూజారి గా చేసేవారు , మేము చిన్న తనం లో ఉక మామ్మ గారు పూజారి గా చేసేవారు . వారి దంపతులు ఇప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళారని తెలిసింది . వారె దగ్గర ఉంది తెలియని వారికీ ఆచార వేవహరాలు తెలిపేవారు. ఇపుడు వారి వారసులు చేస్తున్నారు . 


4.  Sri Tirupatamma Temple

తిరుపతమ్మ దేవాలయము ఊరికి చివరలో ఏటి కి వొడ్డున ఉన్నది . ఈ దేవాలయాని ప్రజల విరాళాల తో లంకె సంపూర్నమ్మ గారు నిర్మించారు . మా చిన్న తన్నం నుండి  ఆమె తిరుపతమ్మ కథలు చేపించటం . సంతానం లేనివారికి పూజలు చేయించటం లాంటివి చెఇంచెవారు . రోజు గుడిని సుభపరచి పూజలు చేసి  న్య్వేధ్యలను పెడతారు ఆమె .దేవాలయము చాల బాగుంటుంది గుడికి ముందర రవి చెట్టు .వేపచెట్టు రకరకాల పూలతో చాల భాగుంటుంది .

















5.  Sri Nagoor Meerasaheb Temple
శ్రీ నాగూర్ మీరాసాహెబ్  దేవాలయము ఏటికి వడ్డున ఉన్నది . ఇక్కడ నివసించేవారు అగ్నికులక్షత్రియులు కావున వీరి వృతి చేపలు పట్టటం . చేపలు పట్టటానికి సముద్రంలోనికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఆపదలు రాకుడదని , చేపలు సంవృద్దిగా దొరకాలని జాలరులు ఈ దేవుని మొక్కుకుని ,పూజలు చేసి వేటకు భయలుదేరతారు . సంవస్తరం కి ఒకసారి శ్రీ నాగూర్ మీరాసాహెబ్ జండా సంబరాన్ని పెద్ద పండగల  ఏప్రిల్  మాసం లో చేస్తారు . అప్పుడు ప్రజలు వారి వారి భందువులని పిలిచి , రకరకాల వంటలు చేస్తారు . దేవుని ఊరమ్తా ఊరెగిస్తారు .పెద్దపెద్ద ప్రభలు కడతారు . జండా సంభారం రోజున సాంఘిక , ప్వైరనిక నాటకాలను నిర్వహిస్తారు , ఏటి కట్టఫై నుండి దేవాలయం వరకు లైటింగ్ నిర్వహిస్తారు .సంభారంలో పిల్లలు రకరకాల భోమ్మలు కొనుకుంటారు , చెరకు గేడలు, కర్జురాలు , మిరపకాయ బజీలు ఇంకా రకరకాల తినుభండారాలు ఉంటాయి . గురం ఏనుగు ఆటలు , చితులాట ల తో ప్రజలు ఆనందిస్తారు .










6.  Sri Kanakadurga temple

శ్రీ కనక దుర్గ దేవాలయము చిన్న ఏటిమొగ లో వంతెన తర్వాత ఉన్నది . ప్రజలు చాల సరదాలతో పూజలు చేస్తారు . దసరా పండుగ టైం లో ఇక్కడి ప్రజలు అమ్మ వారి మాలలు దరించి 41 రోజుల దీక్షలు చేసి , ఇరుముడి కట్టి విజయవాడ వెళ్లి మొక్కులు చెల్లింది ,అమ్మవారిని దర్శించుకుని వస్తారు . అమ్మవారు అష్ట ఇస్వర్యలను ఇస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం .














 7.  Sivalayam
శివాలయం మా చిన్న తనం లో ఒక చిన్న పాక లో ఉండెడిది , అక్కడని నాగేంద్రుని పుట్ట ఉండేది . ఇక్కడ పిల్లలు పుట్టనివారు వచ్చి మొక్కుకుని .దేవుని కృప వలల పుట్టిన వారిని , అక్కడ ఉన్న ఊయలలొ పడుకోబెట్టి మొక్కులు చెల్లించుకుని వెళ్తారు .ఇప్పుడు శివాలయం ను రాతిలో గుడి ల కట్టారు . శివాలయం ఏటి లి వడ్డున  పంటు దగర ఉన్నది .శివరాత్రి రోజున ఇక్కడి ప్రజలు 365 వత్తులతో  జాగారం చేస్తూ ప్రమిదలు వెలిగిస్తారు .










8.  Mariyamata Temple

మరియమ్మ టెంపుల్ పంటు దగ్గరలో ఉన్నది . ఇక్కడి ప్రజలు పరలోక దేవుడిన ప్రభువు యేసు నాదుని చాల అమితముగా ద్యనిస్తారు . యేసు ప్రభు తల్లి ఐన మరియమ్మ దేవాలయాన్ని ఇక్కడ ఏర్పరచి పూజిస్తునారు , ప్రతి ఆదివారం ప్రజలు ఇక్కడ ప్రార్ధనలు చేస్తారు   






               







 





 







 



 



 








 







Comments

Popular posts from this blog

Krishna River Lighthouse Tour

మీసేవ సెంటర్