భావదేవరపల్లిలో పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభం


Sakshi | Updated: June 15, 2013 14:16 (IST)
India :నాగాయలంక : కృష్ణాజిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. నాగాయలంక మండలం భావదేవరపల్లి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలను ఆయన ప్రారంభించారు. కళాశాలలో సీట్ల శాతాన్ని పెంచుతామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. కళాశాల వెబ్‌సైట్ ప్రారంభించి విద్యార్థులు, మత్స్యకారులతో మాట్లాడారు. రూ.67.17 కోట్లతో చేపట్టిన తుపాను అత్యవసర పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ నీలం తుఫాను బాధితుల్ని ఆదుకుంటామని తెలిపారు. అలాగే జిల్లాలోని బ్రిడ్జిలకు సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

Krishna River Lighthouse Tour

మీసేవ సెంటర్