Map
Etimoga route నాగాయలంక నుండి ఏటిమొగ కు బస్సు లోను , ఆటో లో ను వెళ్ళవచ్చును . నాగాయలంక నుండి తలగడ దేవి కొత్తపాలెం ,పెదపాలెం మీదుగా ఏటిమొగ బస్సు వస్తుంది అర గంట టైం పడుతుంది ఏటిమొగ రావటానికి . పంటు దగ్గరకు వెళ్ళే ప్రతి ఉక్కసారి బస్సు ఏటిమొగ లో ఆగుతుంది . గుల్లలమోద వెళ్ళే ప్రతిఉక్క బస్సు ఏటిమొగ లో ఆగుతుంది .
ప్రతి అరగంటకు ఉకసారి ఆటో లు ఉంటాయి .
పగలు 6 గంటల నుండి 10:30 నిమిషాల వరకు బస్సు సౌకర్యం ఉంటుంది
పగలు 6 గంటల నుండి 8 గంటల వరకు ఆటో లు ఉంటాయి
పంటు దగర నుండి 6 గంటల వరకు బస్సు సౌకర్యం ఉంటుంది . తర్వాత ఎదురుమొండి వెళ్ళటానికి గాని ,ఎదురుమొండి నుండి రావటానికి గాని ఎటువంటి సౌకర్యం ఉండదు . వెళ్ళాలనుకున్నా , రావలన్నుకున్నా పడవలను మాట్లాడుకుని రావాలి .
ఏటిమొగ నుండి అడవిపాలెం వెళ్ళటానికి పదవ సౌకర్యం ఉంది , ఏటిమొగ గ్రామ ప్రజలు ఈ పడవను తిప్పుతారు . సంవస్తరానికి ఒకసారి ఈ పడవకు పాట పెడతారు .ఎక్కువ పడిన వారికి ఈ పడవను తిప్పే అవకాసం ఉంటుంది . ఈ పదవ రహదారి ద్వారా అడవిపాలెం , గంగడిపాలెం , లక్ష్మి పురం , రాజుకాలవ , లంకివేనిదిబ్బ , తుమ్మల , మొలగుంట , జోన్నరిపాలెం , రేపల్లె ,చేన్నుపల్లివారిపాలెం, పెనుమూడి ,పిరాటలంక వంటి గ్రామాలకు వెళ్ళవచ్చు .
Comments
Post a Comment